1, అక్టోబర్ 2012, సోమవారం

మాండలికాలతోనే ముందుకు

   
తెలంగాణా (వరంగల్లు, నల్లగొండ) మరియు నడిమి కోస్తా (కృష్ణా) మాండలికాల కలయిక మా ఊరిలో చాలా తేటగా కన్పిస్తుంది. అందులో ఎక్కువపాళ్ళు తెలంగాణా మాండలికానికి చెందుతాయి. మాండలికాల కలయిక మీద ఆరయిక (పరిశోధన) చేయదలచిన వారికి ఈ  ప్రాంతం  తప్పక ఆసక్తిని కలిగించగలదు. మా ఊరిలో నేటికీ వాడుకలో ఉన్న కొన్ని మాటలు మీ కొరకు ఇవిగోండి.
మాఊరిమాట: తెలుగు/సంస్కృతం/ ఆంగ్లం
ఒడుపు = technique
ప్రయోగం: ‘పని తేలిగ్గా చేయాలంటే దాని ఒడుపు తెలియాలి’
ఉలపా = bonus
కూలి కాకుండా పనివాళ్ళు బాగా పనిచేసినందుకో, పండగ సందర్భంగానో, రైతులు లేదా పనికి పెట్టుకున్నవారు పనివాళ్ళకు అదనంగా ఇచ్చే డబ్బు, తిండి గింజలు మున్నగు వాటిని ఈ మాటతో పిలుస్తారు.
తోలకం = driving (noun)
ఫ్ర: ‘నీ బండి తోలకం గిట్టుబాటుగా ఉందా?’
దండగ= జరిమానా, అపరాధ రుసుము, penalty, fine
ఊరిలో ఏదైనా పంచాయతి (తగాదా/ గొడవ పరిష్కారంఅన్న తెల్లంలో) జరిగినప్పుడు, తప్పు చేసిన వారికి డబ్బు రూపంలో గానీ, వస్తు రూపంలో గానీ విధించే శిక్ష. ఈ మొత్తం కొన్నిసార్లు పంచాయతి పెద్దలకు, కొన్నిసార్లు నష్టపోయిన వారికి చెందుతుంది.
కుంపు= నాకా, Absent(noun)
ఈ మాట గమనించి నేను చాలా అబ్బురపడ్డాను. పనికి గైర్హాజరవడాన్ని పనికి ‘కుంపవడం’ అంటారు. ఎన్నిసార్లు/ రోజులు పనికి రాకపోతే అన్ని కుంపులు అన్నమాట.
తెరిపి = విరామం, break
పనికీ పనికీ మధ్య లేదా పని మధ్యలో కాసేపు పని లేకుండా ఉండే/ ఆపే సమయం. ఒకటే పోతగా వాన కురిసేటప్పుడు ‘వాన తెరిపి ఇయ్యకుండ గురత్తంది (ఇవ్వకుండా కురుస్తున్నది)’ అంటూ ఉంటారు.
ఓటి = బలహీనమైన, weak
దీనికి ఒక మచ్చు- ‘ఓటి కుండ’. / చిల్లు పడిన కుండను అలా అంటారు.
తిత్తి= సంచి
నా చిన్నతనములో ఎండాకాలం ఎండనపోయేవారు/ గొడ్లుకాసేవారు (పశువుల కాపరులు) తమతోపాటు తోలుతో కుట్టిన ‘తోలు తిత్తి’లో నీరు తీసుకుపోయేవారు. అందులో నీళ్ళు చల్లగా ఉంటాయి.
ఎచ్చిడి= పరిహాసము, making fun of
üÐFҬеã = contract
ఏదైనా పని మొత్తం ఒకరికి లేదా ఒక ముఠాకి అప్పగించడాన్ని లేదా తీసుకోవడాన్ని వరుసగా, గుత్తకియ్యడం లేదా గుత్తకి తీసుకోవడం అంటారు.
జింగ = catch (noun)
బంతి ‘జింగపట్టులాట’ అనేది చిన్న పిల్లలు బంతితో ఆడుకునే ఆటల్లో ఒకటి.
ఎరక (యెరుక)= knowledge
సట్టం =frame
ఏదైనా కట్టేముందు (నిర్మించే ముందు) దానికి కావలసినవేరు (root)) అల్లిక/ కట్టడం (నిర్మాణం)ని ఇలా పిలుస్తారు. దీనికి మేటిమచ్చు ‘బండి సట్టం’ (=frame/body of a cart) అనే మాట. ఈ మాటను చాలా పనిముట్లకు, బండ్లకు (వాహనాలకు) వాడవచ్చని నా అనుకోలు.
గిర్ర = చక్రం, wheel
‘గిర్రున తిరగడం’ అనే మాట చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు తెలిసిందా పైన చెప్పిన మాటకూ దీనకీ చుట్టరికం. ద్విచక్ర వాహనం, త్రిచక్రవాహనం మొ. అంటూ పత్రికల్లో నోరు తిరగకుండా కనిపెట్టి వ్రాసే సంస్కృత మాటలకు మారుగా, మా ఊరిలో ‘రెండు గిర్రల బండి’, ‘మూడు గిర్రల బండి’, ‘నలు/నాలుగు గిర్రల బండి’ అని వాడుతున్నారు. ఎంత తేలికగా ఉన్నాయో ఈ మాటలు చూడండి.
మట్టు= పద్ధతి
‘పని మట్టుగా చెయ్యి’ అంటే పని చక్కగా, ఒక పద్ధతిలో చేయమని తెల్లము. ‘గుట్టుమట్లు’ అనే మాట ఈ సందర్భంలో గుర్తుకు రావచ్చు. దానికి ఆంగ్లంలో trade secrets అనే మాట సరిపోతుందనుకుంటా.
ఇలా తవ్వుతూ వ్రాస్తూ పోతే నేటి అక్కరలకు పనికి రాగల మాటలు ఎన్నో మన పల్లెల్లో దొరకుతాయ. కొన్నిసార్లు మాటల తెల్లములను మనము కొత్త వాటికి పొడిగించుకోవాలి. మచ్చుకి, పైన చెప్పిన ‘సట్టం’ అనే మాట బండికి మాత్రమే వాడతారు కదా. అందుచేత వేరే వాటికి ఎలా వాడతాం అని కూర్చుంటే మన నుడి పెంపు జరగదు. చాలామంది ఈ మాటలు రాతకోతల్లో వాడడానికి పనికిరావు అంటూ కొత్త సంస్కృత మాటలు కనిపెట్టడానికి సిద్ధపడతారు లేదా కొందరు పత్రికల వాళ్ళు ఉన్న దున్నట్టుగా ఆంగ్ల మాటలను వాడతారు తప్ప మన చెంతనే ఉన్న ఈ పల్లె మాటలను పట్టించుకోరు. ఎందుకని అడిగితే అవి మాండలికపు మాటలు అందరికీ తెలియవు అని చెప్తారు.
మాండలికపు తేడాలు లేని భాష ఒక భాషేనా? తెలుగు ఎవరో నలుగురు కూర్చుని కనిపెట్టి వ్రాసిన భాష కాదుగదా. మనది జీవ భాష. ఎల్లప్పుడూ పారే ఏరు లాంటిది. తేడాలు, రకరకాలు (వైవిధ్యత, variety) చాలా సహజం. ఆ మాటకొస్తే, ఈ పండితులు, పత్రికలవాళ్ళూ కనిపెట్టి ప్రచారం చేసే నోరు తిరగని సంస్కృత మాటలూ, అప్పు తెచ్చుకున్న ఆంగ్ల మాటలూ ప్రజలందరికీ ముందే తెలుసా? అవి అందరికీ అర్థమవుతాయా? ఇకనైనా రాత కోతలను మార్చే చోటులో కూర్చున్న వారు తమ తలపు తీరు (ఆలోచనా విధానం)ను మార్చుకోవాలి. దీనికి నాకు తోచే దారి ఏమంటే, అన్ని సీమలవారూ కూర్చుని, అన్ని మాండలికాల నుంచి ఇలాంటి మాటలు ఏరి, ఎట్టి ప్రాంత తేడాలు లేకుండా, తేలికగా ఉన్నట్టి, దాని నుంచి మరిన్ని మాటలు పుట్టించవీలున్నట్టి మాటలను వడపోసి పత్రికల ద్వారా, బడి పుస్తకాలద్వారా, కవులు తమ రచనల ద్వారా అందరికీ వాడుకలోకి తేవాలి.
అలాకాక చాన్నాళ్ళుగా మన దగ్గర జరుగుతున్నట్టుగా రెండుమూడు జిల్లాల మాండలికమే ప్రామాణికం అని మిగతావి వ్రాతలో వాడకూడదు అనో, ఎవరికి వారు తమ మాండలికమే గొప్పదనో కొట్లాడితే మన నుడికి ఇంకా తీరని నష్టం కలుగుతుంది. అప్పుడు ‘పిట్ట పిట్టపోరు పిల్లి తీర్చినట్టు’గా వేరే భాషలు మన నుడిని మింగివేస్తాయి. పల్లె మాటలు ఒకచోట కూర్చడం అనేది తెలుగు మీద పరిశోధన చేసే వారి పని మాత్రమే కాదు , మనందరిదీనూ. నా వంతుగా నేను ఈ పనిని నా బ్లాగులో (http::achchatelugu.blogspot. com/ ఛేస్తున్నాను. మీరు కూడా మొదలుపెట్టండి మరి.

6 కామెంట్‌లు:

  1. మంచి పోస్టు.ఇలా మీకు తెలిసినవి వ్రాస్తూ ఉండండి.ఒడుపు, ఉలపా,ఓటి తిత్తి మట్టు,తెరిపి --ఇవి మా ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయి.దండుగ అనేది (పన్ను, జరిమానా అనే అర్థాల్లో కావ్యాలలో కూడా ఉన్న మాటే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలకి ముందుగా దండాలు. ఇప్పుడు మీరు చెప్పబట్టి మా ఊరిలో వాడుకలో ఉన్నట్లుగా నాకు తెలిసిన మాటలు ఉత్తరాంధ్రలో కూడా వాడుకలో ఉన్నాయని తెలిసాయి. ఎవరికి వారము ఈ మాటలు కేవలము మా దగ్గర మాత్రమే వాడుకలో ఉన్నవేమో, ఇతరులకు తెల్లము కావేమోనని అనుకుంటూ ఉంటాము. దీన్ని ఆసరాగా తీసుకుని, కొందరు ప్రామాణికత పేరుతో ఎక్కడా వాడుకలో లేనట్టి కొత్త మాటలు సంస్కృతమ్నుంచి పుట్టిస్తూ ఉంటారు.లేదా ఉర్దూవో లేదా ఇంగిలీషువో రాస్తూ ఉంటారు. మనం కూడా వాటికి తలూపుతాము. అందుకే ముందుగా పల్లె మాటలన్నీ ఒక చోట కూర్చాలి. దానిలోనుండి మనకు కావలసిన, నేటి అక్కరలకు పనికి వచ్చే మాటలు ఏరుకోవచ్చు. నిజానికి నన్నడిగితే, మాండాలికాల నడుమ మాటలమూటలో ఎక్కువ తేడాలుండవు. తేడా తలగా యాసలో ఉంటుంది. ఇకనైనా మంది నుడికి(ప్రజల భాషకి) రాతకోతల గౌరవం దక్కాలని, కోరుదాం.

      తొలగించండి
  2. I AM FROM KHAMMAMETT
    నాకు తెలిసిన పదాలు
    frame=సట్రం


    రిప్లయితొలగించండి